LOADING...
Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌ జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం.. క్రస్ట్ గేట్లు మూసివేత 
నాగార్జునసాగర్‌ జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం.. క్రస్ట్ గేట్లు మూసివేత

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌ జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం.. క్రస్ట్ గేట్లు మూసివేత 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2025
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం క్రమంగా తగ్గడంతో, అధికారులు ఆదివారం రోజున డ్యామ్‌ క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదలను నిలిపివేశారు. సాయంత్రం 6 గంటల సమయానికి అందిన అధికారిక సమాచారం ప్రకారం, శ్రీశైలం జలాశయం నుంచి సగటున 63,580 క్యూసెక్కుల వరద ప్రవాహం సాగర్‌కు వస్తోంది. ఈ ప్రవాహాన్ని పలు మార్గాల్లోకి విడుదల చేశారు. కుడికాల్వ ద్వారా 3.46 టీఎంసీలు, ఎడమకాల్వ ద్వారా 3.18 టీఎంసీలు, ప్రధాన హైడ్రోఎలక్ట్రిక్ కేంద్రం ద్వారా 13 టీఎంసీలు, అలాగే క్రస్ట్‌గేట్ల ద్వారా 85టీఎంసీల నీటిని విడుదల చేసినట్టు అధికారులు వివరించారు. మొత్తంగా సాగర్ నుంచి విడుదల చేసిన నీటి పరిమాణం 104.64 టీఎంసీలుగా నమోదైంది.

వివరాలు 

శ్రీశైలంలో కూడా గేట్లు మూసివేత 

అదే విధంగా, శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ఆదివారం ఉదయం అధికారులు అక్కడి క్రస్ట్‌గేట్లను మూసివేశారు. సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 882.10 అడుగులకు చేరగా, నీటి నిల్వ మొత్తం 199.7354 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.