తదుపరి వార్తా కథనం

Haridwar: హరిద్వార్ మన్సాదేవి ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 27, 2025
10:52 am
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లోని మన్సాదేవి ఆలయంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ఆలయాన్ని దర్శించేందుకు భారీగా భక్తులు చేరుకోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడినట్లు గర్హ్వాల్ కమిషనర్ అధికారికంగా వెల్లడించారు. గాయపడినవారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆలయం పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి