Page Loader
Stampede in Mahakumbh: కుంభమేళాలో తొక్కిసలాట.. ప్రధాని మోదీ నాలుగుసార్లు ఫోన్ చేశారు : యోగి ఆదిత్యనాథ్‌
కుంభమేళాలో తొక్కిసలాట.. ప్రధాని మోదీ నాలుగుసార్లు ఫోన్ చేశారు : యోగి ఆదిత్యనాథ్‌

Stampede in Mahakumbh: కుంభమేళాలో తొక్కిసలాట.. ప్రధాని మోదీ నాలుగుసార్లు ఫోన్ చేశారు : యోగి ఆదిత్యనాథ్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళా సందర్భంగా మౌని అమావాస్య రోజున విపరీతమైన రద్దీ ఏర్పడిన కారణంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ అంశంపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తాజాగా స్పందించారు. కుంభమేళా వద్ద ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు నాలుగుసార్లు ఫోన్ ద్వారా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రోజు తెల్లవారుజామున ఒంటిగంట నుంచి రెండు గంటల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.

Details

బారికేడ్లు దాటడం వల్లనే ప్రమాదం

బారికేడ్లు ఏర్పాటు చేసినా భక్తులు వాటిని దాటడానికి ప్రయత్నించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ముఖ్యమంత్రి వివరించారు. మృతుల గురించి ఎలాంటి వివరాలు తెలపకపోయినా, పలువురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని ఆయన తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని వెల్లడించారు.