తదుపరి వార్తా కథనం

DGP: ఏపీలోని ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ల ఏర్పాటు దిశగా చర్యలు: డీజీపీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 28, 2025
11:45 am
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని, ఇతర నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
సైబర్ క్రైమ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న సమస్య అని, దీన్ని ఎలా నియంత్రించాలో ఆలోచిస్తున్నామని చెప్పారు.
ఇక ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని ఆయన వెల్లడించారు.
అనుమానితుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు డబ్బులు చెల్లించకూడదని ప్రజల్లో అవగాహన కల్పించడమే సైబర్ క్రైమ్‌ను అరికట్టేందుకు ప్రధాన మార్గమని చెప్పారు.
నిపుణుల సాయం తీసుకోవడం, అవగాహన పెంచడం అత్యంత అవసరమని డీజీపీ పేర్కొన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని, ఇది ఆందోళనకరమైన విషయమన్నారు.