LOADING...
Immigration and Foreigners Act:అక్రమ విదేశీయులపై ఉక్కుపాదం..నకిలీ పాస్‌పోర్ట్, వీసాతో భారత్‌లోకి వస్తే 5 ఏళ్ల జైలు, రూ.5 లక్షల జరిమానా 
అక్రమ విదేశీయులపై ఉక్కుపాదం..నకిలీ పాస్‌పోర్ట్, వీసాతో భారత్‌లోకి వస్తే 5 ఏళ్ల జైలు, రూ.5 లక్షల జరిమానా

Immigration and Foreigners Act:అక్రమ విదేశీయులపై ఉక్కుపాదం..నకిలీ పాస్‌పోర్ట్, వీసాతో భారత్‌లోకి వస్తే 5 ఏళ్ల జైలు, రూ.5 లక్షల జరిమానా 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 02, 2025
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించే వారిపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులు, ఇమ్మిగ్రేషన్ అంశాలను నియంత్రించేందుకు రూపొందించిన 'ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం, 2025' సెప్టెంబర్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. హోం మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందగా, 2025 ఏప్రిల్ 4న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. హోం మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి నితేష్‌కుమార్ వ్యాస్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం, 2025(చట్టం సంఖ్య 13)లోని సెక్షన్ 1, సబ్-సెక్షన్(2)ప్రకారం, సెప్టెంబర్ 1, 2025 ఈ చట్టం ప్రారంభ తేదీగా ప్రకటించినట్లు పేర్కొన్నారు.

Details

 కఠిన శిక్షలు, భారీ జరిమానాలు

ఈ చట్టం ప్రకారం - నకిలీ పాస్‌పోర్ట్ లేదా వీసా ఆధారంగా భారత్‌లోకి ప్రవేశించే, మోసపూరితంగా ఇక్కడ నివసించే లేదా బయలుదేరే వారిపై కనీసం 2 సంవత్సరాల జైలు శిక్ష, కనీసం రూ. 1 లక్ష జరిమానా విధిస్తారు. గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష పాటు రూ. 10 లక్షల వరకు జరిమానా కూడా విధించవచ్చు. చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా భారత్‌లోకి వచ్చిన విదేశీయులకు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ. 5 లక్షల జరిమానా లేదా రెండూ విధించబడతాయి.

Details

ఇమ్మిగ్రేషన్ బ్యూరోకు అధిక అధికారం 

ఈ చట్టం ఇమ్మిగ్రేషన్ బ్యూరో అధికారాలను మరింత బలపరుస్తుంది. ఇకపై ఈ ఏజెన్సీ - అక్రమ విదేశీయులను వెంటనే బహిష్కరించే అధికారం కలిగి ఉంటుంది. రాష్ట్రాలతో నేరుగా సమన్వయం చేసుకోగలదు. సంస్థలకు కఠిన నిబంధనలు హోటళ్ళు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు- విదేశీయులపై ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందించాలి. తమ వద్ద అక్రమ విదేశీయులు ఉన్నట్లు తేలితే, ఆ సంస్థ రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుంది

Details

ఎయిర్‌లైన్స్‌, షిప్పింగ్ కంపెనీలకు కొత్త బాధ్యతలు

భారత్‌కు చేరుకున్న తర్వాత, అన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు, షిప్పింగ్ కంపెనీలు ప్రయాణికుల పూర్తి మానిఫెస్ట్‌, సిబ్బంది వివరాలు, ముందస్తు సమాచారం, ఇమ్మిగ్రేషన్ అధికారి లేదా పౌర అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. సమగ్ర చట్టం ఈ ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం, 2025 ద్వారా విదేశీయులు, ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన అన్ని నిబంధనలను ఒకే చట్టం కిందకి తీసుకురావడం జరిగింది.