LOADING...
AP Inter Exams: ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై కఠిన నిబంధనలు.. 10.58 లక్షల విద్యార్థుల హాజరు
ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై కఠిన నిబంధనలు.. 10.58 లక్షల విద్యార్థుల హాజరు

AP Inter Exams: ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై కఠిన నిబంధనలు.. 10.58 లక్షల విద్యార్థుల హాజరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2025
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి 20 వరకు జరుగుతాయి. అలాగే, ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 3 నుంచి 15 వరకు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.  రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 1535 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10,58,892 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 67,952 మంది విద్యార్థుల కోసం, 325పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Details

 సమీక్ష సమావేశంలో ముఖ్య ఆదేశాలు 

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షలు సజావుగా కొనసాగేందుకు కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మొత్తం 1535 పరీక్షా కేంద్రాల్లో 68 సెంటర్లను సెన్సిటివ్ కేంద్రాలుగా, 36 సెంటర్లను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి, అదనపు భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సౌకర్యాలు, భద్రతపై ప్రత్యేక దృష్టి వేసవి దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, బెంచీలు, ప్రధమ చికిత్స సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షల సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేయడం, పేపర్ లీకేజీ వంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Details

 144 సెక్షన్ విధింపు 

పరీక్షా కేంద్రాల పరిధిలో 100 మీటర్ల లోపల 144 సెక్షన్ అమలు చేయాలని నిర్ణయించారు. పరీక్షల సమయంలో జిరాక్స్ కేంద్రాలు, నెట్ సెంటర్లను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు ప్రత్యేక ఏర్పాట్లు విద్యాశాఖ కార్యదర్శి కె. శశిధర్ ప్రకారం, ఇంటర్, ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి తగిన సంఖ్యలో ఆర్టీసీ బస్సులను నడపాలని సూచించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రాష్ట్ర స్థాయిలో టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1531ను అందుబాటులో ఉంచారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు.

Details

 పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు 

వయోజన విద్యాశాఖ డైరెక్టర్ కృతికా శుక్ల సమీక్షలో సీసీటీవీ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అనుమతించమని స్పష్టం చేశారు. ఆరోగ్య, భద్రతా చర్యలు తగిన ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేయడంతో పాటు అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్ సేఫ్ కస్టడీలో ఉంచి పరీక్షా కేంద్రాలకు తరలించాలని, పరీక్ష అనంతరం జవాబు పత్రాలను సీల్ చేసి స్పీడు పోస్టు ద్వారా పంపించాలని సూచించారు. ఈ ఏర్పాట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు.