Hyderabad: సూడాన్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ప్రయాణికుడికి ఎబోలా హిస్టరీ.. గాంధీ ఆసుపత్రికి తరలింపు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఎబోలా వైరస్‌కు సంబంధించిన కలకలం చోటుచేసుకుంది. సూడాన్ నుంచి వచ్చిన మహ్మద్ అనే ప్రయాణికుడిని విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య పరీక్షల కేంద్రంలో వైద్య సిబ్బంది పరిశీలించారు. స్క్రీనింగ్ సమయంలో అతనికి ఎబోలా వైరస్‌కు సంబంధించిన హిస్టరీ ఉన్నట్లు గుర్తించడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
వివరాలు
శాంపిల్స్‌ను సీసీఎంబీకి పంపిన వైద్యులు
ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ ప్రయాణికుడిని వెంటనే గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అక్కడ అతనికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ప్రయాణికుడి నుంచి శాంపిల్స్ సేకరించి తదుపరి పరీక్షల కోసం సీసీఎంబీకి పంపించినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాత అతని ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.