Sudha Murthy : రాజ్యసభకు నామినేట్ అయిన సుధా మూర్తి
భారతీయ విద్యావేత్త, రచయిత్రి సుధా మూర్తి రాజ్యసభకు నామినేట్ అయినట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. ఈ వార్త ను ప్రధాని X వేదికగా ప్రకటించారు."భారత రాష్ట్రపతి @SmtSudhaMurty జీని రాజ్యసభకు నామినేట్ చేసినందుకు నేను సంతోషిస్తున్నాను.సామాజిక సేవ, దాతృత్వం,విద్యతో సహా విభిన్న రంగాలకు సుధా జీ చేసిన కృషి అపారమైనది,స్ఫూర్తిదాయకం" అని ప్రధాని మోదీ రాశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చిన తన ప్రకటనలో, మూర్తి ఎగువ సభలో ఉండటం "నారీ శక్తి (మహిళా శక్తి)కి ఒక శక్తివంతమైన నిదర్శనం, ఇది దేశం విధిని రూపొందించడంలో మహిళల శక్తి , సామర్థ్యాన్ని ఉదాహరణగా చూపుతుంది" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
2023లో సుధామూర్తికి పద్మ భూషణ్
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి. ఒక ఉపాధ్యాయురాలుగా ప్రస్థానం ప్రారంభించిన సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. సుధా మూర్తి రచయిత. 2006లో ఆమె చేసిన సామాజిక సేవకు గానూ ప్రభుత్వం భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. 2023లో ఆమెకు భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ కూడా లభించింది. ఈ సందర్భంగా సుధామూర్తి, నామినేట్ చేసినందుకు పీఎం మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. "ఇది నాకు పెద్ద మహిళా దినోత్సవ బహుమతి అని, దేశం కోసం పని చేయడం కొత్త బాధ్యత అన్నారు.