Page Loader
Sudha Murthy: 'మాజీ రాష్ట్రపతి కలాంఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అనుకున్నాను': సుధా మూర్తి  
'మాజీ రాష్ట్రపతి కలాంఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అనుకున్నాను': సుధా మూర్తి

Sudha Murthy: 'మాజీ రాష్ట్రపతి కలాంఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అనుకున్నాను': సుధా మూర్తి  

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2024
02:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇన్ఫోసిస్ మాజీ చైర్‌పర్సన్ నారాయణ మూర్తి సతీమణి, రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశారు. 2006లో తనకు ఒకసారి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నుంచి ఫోన్ వచ్చిందని వెల్లడించారు. తానే దాన్ని నమ్మలేక 'రాంగ్‌ నంబర్‌' అని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరిస్తున్న చిత్రాన్ని, మాజీ రాష్ట్రపతితో తన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

వివరాలు 

'రాంగ్ నంబర్‌' అని చెప్పా: సుధా మూర్తి 

''ఒకసారి నాకో ఫోన్‌ కాల్‌ వచ్చింది. అబ్దుల్‌ కలాం నాతో మాట్లాడాలనుకుంటున్నట్లు ఆపరేటర్‌ చెప్పగా.. ఆయనకు నాకుఎటువంటి పరిచయం లేదు కాబట్టి నేను వెంటనే 'రాంగ్ నంబర్‌' అని చెప్పా. నా భర్త నారాయణమూర్తికి చేయబోయి పొరబాటున నాకు చేశారేమో చూసుకోండి అని చెప్పానన్నారు. అప్పుడు ఆపరేటర్‌ స్పందిస్తూ 'కలాంజీ ప్రత్యేకంగా మీతోనే మాట్లాడాలని చెప్పారు అని అన్నారు. నేను వెంటనే ఒకింత ఆందోళనకు గురయ్యా. ఆ తర్వాత అబ్దుల్‌ కలాంజీ నాతో మాట్లాడారు. 'ఐటీ డివైడ్‌' అనే టాపిక్ పై నేను రాసిన కాలమ్‌ తాను చదివానని, బాగుందని చెప్పారు'' అంటూ అప్పటి సంగతిని గుర్తుచేసుకున్నారు.

వివరాలు 

రాజ్యసభకు నామినేట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

సుధా మూర్తి చాలా పుస్తకాలు రచించారు. ఆమె కన్నడ, ఆంగ్ల సాహిత్యానికి చేసిన కృషికి కూడా ప్రసిద్ది చెందారు. 73 ఏళ్ల మూర్తి సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం, పద్మశ్రీ (2006), పద్మ భూషణ్ (2023) గ్రహీత. ఈ ఏడాది ప్రారంభంలో ఆమెను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆమె కుమార్తె అక్షతా మూర్తి బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్‌ను వివాహం చేసుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సుధా మూర్తి చేసిన ట్వీట్