Loading...
Sukhbir Singh Badal: అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై దాడి
అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై దాడి

Sukhbir Singh Badal: అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై దాడి

వ్రాసిన వారు Moogati Shabari
Aug 13, 2026
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు, పంజాబ్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ (Sukhbir Singh Badal)పై దాడి జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న గురుద్వారా సమీపంలో ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో ఆయనపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాదల్‌ కుడి చేతికి గాయమైంది. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాడి జరిగిన సమయంలో బాదల్‌ సతీమణి, అకాలీదళ్‌ ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ ఘటనలో బాదల్‌ భద్రతా సిబ్బందికి కూడా గాయాలైనట్లు సమాచారం.

వివరాలు

సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై హత్యాయత్నం..

కాగా, 2024 డిసెంబర్‌లోనూ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై హత్యాయత్నం జరిగింది.

అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వెలుపల ఓ వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపాడు.

అయితే, బుల్లెట్‌ గురి తప్పడంతో బాదల్‌ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అక్కడికక్కడే అరెస్టు చేశారు.

పంజాబ్‌ మాజీ సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ కుమారుడే సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌.

2009 నుంచి 2017 వరకు రెండు పర్యాయాలు పంజాబ్‌ ఉపముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు.

వివరాలు

ఘటనపై సమగ్ర దర్యాప్తు..

సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై దాడి విషయం తెలుసుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌.. నాందేడ్‌ ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు.

ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు, తమ పార్టీ అధినేతపై జరిగిన దాడిని శిరోమణి అకాలీదళ్‌ తీవ్రంగా ఖండించింది.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేసింది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్..

ADVERTISEMENT