
School Holidays: తెలంగాణలో వేసవి సెలవులు షురూ.. అధికారిక షెడ్యూల్ విడుదల!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేసవి సెలవులు త్వరలోనే రానున్నాయి. ఎండా కాలం ఆరంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు తమ సెలవులను ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి 2025 వేసవి సెలవుల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది.
విద్యా సంవత్సరాంతానికి చేరుకున్న నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి తమ వేసవి సెలవులకు ముందుగానే ప్రయాణాలు, టూర్ల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసిన విద్యా సంవత్సర క్యాలెండర్ ప్రకారం, రాష్ట్రంలోని పాఠశాలలకు వేసవి సెలవులు 2025 ఏప్రిల్ 24వ తేదీ నుండి ప్రారంభమవుతాయి.
Details
46 రోజుల పాటు వేసవి సెలవులు
పాఠశాలలు తిరిగి జూన్ 12, 2025న ప్రారంభమవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులకు మొత్తం 46 రోజుల పాటు వేసవి సెలవులు లభించనున్నాయి.
విద్యా క్యాలెండర్‌ను అనుసరించి ఈ షెడ్యూల్‌ను ఖరారు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.
వేసవి సెలవులపై గాలిమాటలు చెలామణీ అవుతున్న నేపథ్యంలో స్పష్టత ఇచ్చేలా ఈ ప్రకటన విడుదలైంది.
ఏప్రిల్ 23లోగా అన్ని పరీక్షలు పూర్తవనున్నాయి. అదే రోజున పరీక్షా ఫలితాల ప్రకటన కూడా జరుగుతుంది. తదుపరి రోజైన ఏప్రిల్ 24 నుండి పాఠశాలలకు సెలవులు అమలులోకి వస్తాయి.
Details
జూన్ 2న కళాశాలలు తిరిగి ప్రారంభం
ఇక ఇంటర్మీడియట్ కళాశాలల విషయానికి వస్తే, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) కూడా జూనియర్ కళాశాలల వేసవి సెలవుల షెడ్యూల్‌ను ప్రకటించింది.
అధికారిక ప్రకటన ప్రకారం, రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాలలు మార్చి 31 నుండి జూన్ 1, 2025 వరకు సెలవుల్లో ఉంటాయి.
అనంతరం జూన్ 2న కళాశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.