Hyderabad: ఏప్రిల్, మే నెలల్లో 46°C వరకు ఎండలు? వాతావరణ శాఖ హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత సాధారణాన్ని మించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
వడగాలులు కూడా ఎక్కువగా ఉండే అవకాశముందని హెచ్చరించింది.
ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలకి రాగానే ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.
1901 నుంచి 2025 వరకు గణాంకాలను పరిశీలించినప్పుడు, ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.
దక్షిణ, మధ్య తెలంగాణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా వేడి ఉంటుందని వెల్లడించింది.
Details
రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికం
అలాగే దక్షిణ, ఉత్తర తెలంగాణలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికంగా ఉంటాయని తెలిపింది.
125 సంవత్సరాల గణాంకాల ఆధారంగా, గాలిలో తేమ మోతాదు గణనీయంగా తగ్గిపోయిందని పేర్కొంది.
దీంతో, ఈ వేసవిలో తీవ్రమైన ఎండలతో పాటు వేడి గాలులు కూడా తీవ్రంగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.