హైదరాబాద్ వాసులకు సూపర్ న్యూస్.. ఇక నుంచి ఆర్టీసీ బస్సులో లైవ్ లోకేషన్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ ప్రయాణికులకు సూపర్ న్యూస్ అందింది. ప్రతి బస్సు ప్రయాణికులకు ఎక్కడ ఉందో తెలిసేలా ప్రత్యేకంగా ఓ యాప్ ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది.
నగరంలో ఏ మార్గంలో బస్సు ఉంది, ఎన్ని గంటలకు బస్ స్టాప్ కు బస్సు వస్తుందో తెలిసేలా ఓ యాప్ ను ఆర్టీసీ అధికారులు రూపొందించారు.
తొలుత ఈ యాప్ ను ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ప్రయాణికుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. దీంతో అన్ని బస్సులోనూ ఈ ట్రాకింగ్ సిస్టంను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఆలోచిస్తోంది.
ఈ క్రమంలో బస్సుకు సంబంధించిన వివరాలను టైప్ చేస్తే ఆ బస్సును ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.
Details
ఆర్డినరీ బస్సులోనూ ట్రాకింగ్ సిస్టం
గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీఎస్‌ఆర్టీసీ బస్ ట్రాకింగ్ సిస్టం పేరుతో ఉన్న యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే సిటీ బస్సుల లైవ్ లోకేషన్ తెలుస్తుంది.
ప్రస్తుతం నగరంలో 800 మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్ల మాత్రమే ట్రాకింగ్ విధానం అమల్లో ఉంది.
వీలైనంత త్వరలోనే నగరంలోని అన్ని ఆర్డినరీ బస్సుల్లో ఈ విధానాన్ని అమలు చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం నగరంలో నడుస్తున్న 1600 ఆర్డినరీ బస్సుల్లో ఈ ట్రాకింగ్ సిస్టం విధానాన్ని అమలు చేయనున్నారు.
దీంతో బస్సులను ట్రాక్ చేయడానికి ఈ ఆర్టీసీ యాప్ ఉపయోగపడుతుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.