
Mega Job Mela : నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. 10వేల మందికి పైగా ఉద్యోగావకాశాలు
ఈ వార్తాకథనం ఏంటి
నిరుద్యోగుల కోసం తెలంగాణలోని మెగా జాబ్ మేళా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ భారీ కార్యక్రమంలో మొత్తం 150 కంపెనీలు భాగస్వామ్యమవుతున్నాయి. నిర్వాహకుల ప్రకారం 10,000 మందికిపైగా నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళా హుజూర్‌నగర్ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెనుక గల స్కూల్‌లో ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సెక్రటేరియేట్‌లో డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ అధికారులతో కలిసి ఈ జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సహకారంతో నిర్వహిస్తున్నారు.
Details
ఈ జాబ్ మేళాలో 150 కంపెనీలు పాల్గొంటాయి
కాగా జాబ్ మేళా ప్రారంభాన్ని మంత్రి శ్రీధర్ బాబు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ జాబ్ మేళాలో 150 కంపెనీలు పాల్గొని, 10వేల మందికి పైగా నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పరిశీలించవచ్చని తెలిపారు. నిరుద్యోగుల కోసం మేళా వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అలాగే ఆన్‌లైన్ సేవలు అందించడానికి కంప్యూటర్లు, ప్రింటర్లు, జిరాక్స్ మిషన్‌లు వంటి అవసరమైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెన్త్ పాస్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, పీజీ, ఫార్మసీ కోర్సుల్లో ఉత్తీర్ణత పొందిన 18 నుండి 40 ఏళ్ల వయస్సు కలిగిన యువతీ, యువకులు పాల్గొనడానికి అర్హులు.