CAA: కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు.. ఏప్రిల్ 9న తదుపరి విచారణ
2019 పౌరసత్వ సవరణ చట్టంపైస్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. మూడు వారాల్లోగా ఈ పిటీషన్లకు వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. ప్రస్తుతం సీఏఏ అమలుపై స్టే విధించేందుకు కోర్టు నిరాకరించింది. అయితే ఈ కేసులో మళ్లీ ఏప్రిల్ 9వ తేదీన విచారణ ఉంటుందని సుప్రీం తెలిపింది. దేశ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం 230కి పైగా పిటిషన్లను విచారించింది. గత వారం,మార్చి 11(సోమవారం),భారత ప్రభుత్వం CAA కింద పౌరసత్వం మంజూరు చేయడానికి నిబంధనలను విడుదల చేసింది. అంటే నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న CAA వివాదాస్పద చట్టం అమల్లోకి వచ్చింది.