Supreme Court : బాణాసంచాపై నిషేధం విధించలేమన్న సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
టపాకుల వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా వినియోగం, కొనుగోళ్లు, అమ్మకాలపై దాఖాలపై పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఇవాళ విచారించింది.
దేశంలో బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
పిల్లలు కన్నా పెద్దలే టపాసులు ఎక్కువగా కాల్చుతున్నారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
పర్యావరణానికి హాని కలిగించే అంశాలు కేవలం కోర్టుకు మాత్రమే బాధ్యత ఉందన్న తప్పుడు భావన ప్రజల్లో ఉందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయూతంగా వ్యవహరించాలని చెప్పింది.
Details
ఆస్పత్రులు, పాఠశాలలు వంటి ప్రాంతాల్లో నిషేధం విధించాలన్న పిటిషనర్
ఇక దేశంలో బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లు, వినియోగంపై బ్యాన్ కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.
రాజస్థాన్ కు చెందిన పిటిషనర్ వేసిన పిటిషన్లపై నేడు విచారణ చేపట్టింది. ఆస్పత్రులు, పాఠశాలలు వంటి ప్రాంతాల్లో బాణా సంచా వినియోగం లేకుండా నిషేధం విధించాలని పిటిషనర్ కోరారు.
పండగ సీజన్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ రాష్ట్రానికి న్యాయస్థానం సూచించింది.