LOADING...
Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌పై సుప్రీంకోర్టులో సవాలు.. భర్తకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు?
సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌పై సుప్రీంకోర్టు సవాలు.. భర్తకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు?

Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌పై సుప్రీంకోర్టులో సవాలు.. భర్తకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2025
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

లద్దాఖ్‌ ఉద్యమ నేత 'సోనమ్ వాంగ్‌చుక్' జాతీయ భద్రత చట్టం (NSA) కింద అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ, ఆయన భార్య గీతాంజలి జె. అంగ్మో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ సోమవారం విచారణకు వాయిదా పడింది, తర్వాతి రోజు మంగళవారం విచారణ జరగనుంది. కోర్టు ఈ సందర్భంలో కేంద్రం, జమ్ముకశ్మీర్ యంత్రాంగం, రాజస్థాన్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది . వాంగ్‌చుక్‌ను NSA కింద నిర్బంధించడంలో ముందస్తు నోటీసులు ఇవ్వకపోవడానికి కేంద్రం ఎందుకు విఫలమైందనే ప్రశ్నను సుప్రీంకోర్టు కేంద్రానికి చేశారు. గీతాంజలి, తన భర్తను NSA కింద అరెస్ట్ చేయడం అన్యాయమని పేర్కొంటూ, ఆయనను తక్షణమే విడుదల చేయాలని కోర్టులో విజ్ఞప్తి చేశారు.

Details

టెలిఫోన్ ద్వారా మాట్లాడే అవకాశం కల్పించాలి

అలాగే జోధ్‌పుర్ జైలులోని వాంగ్‌చుక్‌ను సర్వోన్నత న్యాయస్థానం ముందు హాజరుపరచాలని, ఆయనతో నేరుగా లేదా టెలిఫోన్ ద్వారా మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు. ఆమె ఆరోపణ ప్రకారం సెప్టెంబరు 26న అరెస్ట్ చేసినప్పటి నుండి భర్తతో మాట్లాడనివ్వడం లేదు, కలవనివ్వడం లేదని గీతాంజలి పేర్కొన్నారు. అందులో ఆమె ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కొన్ని నెలలుగా కుట్రలు జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా కోర్టుకు తెలపింది. వాంగ్‌చుక్‌కు పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలు లేవని ఆమె స్పష్టంగా చెప్పారు. గీతాంజలి తన భర్తను విడుదల చేయమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులకు ముందుగానే లేఖలు రాసిన విషయమూ తెలిసిందే.