ED vs TMC: మమతా-ఈడీ వివాదం సుప్రీంకోర్టుకు.. ఎన్నికల ముందే సోదాలెందుకని టీఎంసీ ప్రశ్న
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)మధ్య పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ,ఈడీ లాయర్ల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించగా, మమతా బెనర్జీ తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంలో మమతా బెనర్జీ ప్రభుత్వం మీద ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. తమ అధికారులు ఉపయోగించిన ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు మమతా బెనర్జీ సహా బంగాళా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఈడీ తరపున అడ్వకేట్ పేర్కొన్నారు.
వివరాలు
మమతా బెనర్జీ ప్రణాళిక ప్రకారమే ఈ కథను నడిపిస్తున్నారు
ఐ-ప్యాక్ కార్యాలయానికి మమతా బెనర్జీ వెళ్లాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. అదేవిధంగా, బంగాళా పోలీసులు సీసీటీవీ ఫుటేజీని ధ్వంసం చేశారని,కోల్‌కతా హైకోర్టులో తమ లాయర్ వాదించకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. హైకోర్టులో లాయర్ మైక్‌ను కూడా కట్ చేశారని తుషార్ మెహతా ఆరోపించారు. మమతా బెనర్జీ ప్రణాళిక ప్రకారమే ఈ కథను నడిపిస్తున్నారని ఈడీ అభిప్రాయపడింది. హైకోర్టుకు బస్సులు ఏర్పాటు చేసి ప్రజలను తరలించారని కూడా ఈడీ పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టు, "హైకోర్టును జంతర్‌మంతర్‌లా మార్చారా?" అని ప్రశ్నించడంతో, ఇది చాలా సీరియస్ విషయం అని, సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని, కేసు మొత్తం పూర్తిగా పరిశీలించాలని ఆదేశించింది. తరువాత,మమతా బెనర్జీ తరపు న్యాయవాదులు ఈడీ చర్యలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
వివరాలు
ఈడీ పక్షపాత ధోరణి
దాలు చేయడానికి రెండు సంవత్సరాలు ఎందుకు ఎదురు చూశారు. ఎన్నికల ముందే సోదాలు జరపాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. సరిగ్గా ఎన్నికల సమయంలో హడావిడి చేయడమే ఈడీ పక్షపాత ధోరణి అని వాదించారు. ఐ-ప్యాక్ కార్యాలయంలో ఎన్నికల మెటీరియల్ ఉన్న విషయం ఈడీకి ముందే తెలుసు, అయినప్పటికీ సోదాల్లో ఏమీ దొరకలేదని, ఈడీ పంచనామాలోనే ఇది రాసిందని మమతా బెనర్జీ లాయర్లు వివరించారు. వారి వాదన ప్రకారం, పార్టీకి సంబంధించిన డివైజ్‌లను మాత్రమే స్వాధీనం చేసుకున్నారని, ఎన్నికల వ్యూహాలను లీక్ చేయకుండా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా, ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ భద్రతలో ఉన్నారని, ఆమె వెంట ఎప్పుడూ పోలీసులు ఉంటారని కూడా మమతా తరపు లాయర్లు న్యాయస్థానానికి తెలియజేశారు.