LOADING...
Telangana Govt: బీసీ రిజర్వేషన్ల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట
బీసీ రిజర్వేషన్ల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

Telangana Govt: బీసీ రిజర్వేషన్ల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2025
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీం కోర్టు ప్రభుత్వం పక్షాన తీర్పు ఇవ్వడంతో ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టులో ఇప్పటికే ఈ కేసు విచారణలో ఉండగా, అదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ ఎందుకు దాఖలు చేశారని న్యాయమూర్తులు ప్రశ్నించారు. దీనికి బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన లాయర్‌ "హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది కాబట్టి ఇక్కడకు వచ్చామని సమాధానమిచ్చారు.

Details

స్వచ్ఛందంగా వెనక్కి తీసుకున్న న్యాయవాది

దీనిపై సుప్రీంకోర్టు హైకోర్టు స్టే ఇవ్వలేదని మాత్రమే ఇక్కడకు వస్తారా? ఆ అంశంపై విచారణ అక్కడే కొనసాగాలని వ్యాఖ్యానించింది. ఈ ప్రక్రియలో సుప్రీంకోర్టు 'కేసు డిస్మిస్‌' అని స్పష్టంగా పేర్కొంది. దీంతో పిటిషనర్‌ తరఫు న్యాయవాది, కేసును స్వచ్ఛందంగా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విధంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించింది.