దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఝలక్.. ప్రధాని డిగ్రీ కేసులో సుప్రీం కీలక నిర్ణయం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్క ఎదురైంది. ప్రధాని మోదీ డిగ్రీ కేసులో గుజరాత్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కేజ్రీ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పిటిషన్ తిరస్కరణకు గురైంది. గుజరాత్ విశ్వవిద్యాలయం దాఖలు చేసిన పరువు నష్టం కేసులో స్టే కోరుతూ కేజ్రీ తొలుత హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం స్టే ఇచ్చేందుకు ఉన్నతన్యాయస్థానం నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారించిన సుప్రీం,కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఆగస్ట్ 29న గుజరాత్ హైకోర్టు తీర్పు వెలువరించనుందని గుర్తు చేసింది. ప్రస్తుతానికి తాము ఎటువంటి నోటీసులు ఇవ్వలేమని, తమ వినతులను మాత్రం హైకోర్టుకు సమర్పించుకోవచ్చని కేజ్రీవాల్, గుజరాత్ వర్సిటీకి సూచనలిచ్చింది.