వాన్‌పిక్ కేసులో ఏపీ సర్కారుకు సుప్రీం నోటీసులు.. స్టేటస్ కోను అమలు చేయాలని ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
వాన్‌పిక్ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ, ఉత్తర్వులిచ్చేవరకు స్టేటస్ కోను అమలు చేయాలని ఆదేశించింది.
వాన్‌పిక్‌కు హైకోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పుపై ఈడీ సుప్రీం తలుపు తట్టింది. శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.
ఇప్పటికే 15 ఏళ్లు వృథా అయ్యాయని, దేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన అంశం ఇందులో ఇమిడి ఉందని వాన్‌పిక్ తరపున న్యాయవాదులు వాదించారు.
వాన్‌పిక్, రాష్ట్ర ప్రభుత్వం - రస్ అల్ ఖైమాతో సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికిల్ అన్నారు. విచారణలో జాప్యం జరుగుతున్నందున ప్రాజెక్టు కదలట్లేదన్నారు.
DETAILS
వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం 22 వేల ఎకరాల భూమిని సేకరించారు
ఈ మేరకు మొత్తం ప్రాజెక్టు భూములను ఈడీ అటాచ్ చేయడం తగదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా 2008లో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని తీర మండలాల్లో వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం 22 వేల ఎకరాల భూమిని సేకరించారు.
వాటిల్లో ప్రభుత్వ భూములతో పాటు ఎసైన్డ్, పట్టా భూములు సైతం ఉన్నాయి.
నిజాంపట్నం మండలంలో అత్యధికంగా దాదాపుగా 10 వేల ఎకరాలకు పైగా సేకరణ చేశారు. ఈ నేపథ్యంలోే ఎసైన్డ్, పట్టా భూముల రైతులకు పరిహారాన్ని అందజేశారు.
అయినప్పటికీ వాన్‌పిక్ ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కేసులు నమోదు చేయడంతో ప్రాజెక్టు నిలిచిపోయింది.