Page Loader
Baba Ramdev: యాడ్ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని యోగా గురు రాందేవ్ ను సుప్రీంకోర్టు ఆదేశం 
యాడ్ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని యోగా గురు రాందేవ్ ను సుప్రీంకోర్టు ఆదేశం

Baba Ramdev: యాడ్ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని యోగా గురు రాందేవ్ ను సుప్రీంకోర్టు ఆదేశం 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 19, 2024
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాబా రాందేవ్ కు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద యాడ్స్ కేసులో కోర్టు ముందు హాజరుకావాలని నోటిసులలో పేర్కొంది. పతంజలి ఉత్పతులకు సంభందించి చేస్తున్న ప్రకటనలను నిలిపివేయాలని గతంలో సుప్రీంకోర్టు పతంజలి ఆయుర్వేదకు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను పతంజలి ఉల్లఘించింది. ఈ నేపథ్యంలో రాందేవ్ తో పాటు మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు కోర్టు నోటీసులిచ్చింది. గతంలో ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈ కేసులో స్పందన నమోదు కాకపోవడంతో మంగళవారం జస్టిస్ హిమా కోహ్లీ,అమానుల్లాతో కూడిన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. బాబా రామ్‌దేవ్‌ను వ్యక్తిగతంగా హాజరుకావాలని కోరడమే కాకుండా,కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు ఆయనను ఎందుకు విచారించకూడదని నోటీసు కూడా జారీ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బాబా రాందేవ్ కు సుప్రీంకోర్టు సమన్లు