Page Loader
బిల్కిస్ బానో నిందితుల విడుదలపై సుప్రీం ప్రశ్నల వర్షం.. విచారణ 24కు వాయిదా
రెమిషన్ పాలసీ కొందరి కోసమేనా

బిల్కిస్ బానో నిందితుల విడుదలపై సుప్రీం ప్రశ్నల వర్షం.. విచారణ 24కు వాయిదా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 18, 2023
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

బిల్కిస్‌ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ 11 మంది ఖైదీలకు 14 ఏళ్ల శిక్షాకాలం పూర్తికాగానే వదిలేయాలన్న సర్కారు నిర్ణయంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇటీవలే 11 మంది దోషులను విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ బిల్కిస్ బానో సుప్రీంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(PIL) దాఖలు చేసింది. ఈ మేరకు గురువారం జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. గుజరాత్‌లో రిమిషన్ పాలసీని ఎంపిక చేసిన వాళ్లకే అమలు చేయడమేంటని ప్రశ్నించింది.వివక్షరహితంగా ఖైదీలందరికీ ఇదే పాలసీని అనుసరిస్తున్నారా అని అడిగింది. మరోవైపు నేరస్థులను ముందస్తుగా రిలీజ్ చేయడాన్ని గుజరాత్‌ ప్రభుత్వం సమర్థించుకోగా,ఈ నిర్ణయాన్ని సర్కారు సమర్థించుకోలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

DETAILS

జైల్లో ఉన్నప్పుడు నిందితులు పశ్చాత్తాపపడ్డారు, కనుక విడుదల చేయాలి : ఏఎస్‌జీ

నిందితులు చేసింది హేయమైన నేరమే, కానీ అత్యంత అరుదైంది మాత్రం కాదని అడిషనల్ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వి.రాజు వాదించారు. జైల్లో ఉన్నప్పుడు పశ్చాత్తాపపడ్డారని అందుకే విడుదలకు అవకాశం ఇవ్వాలన్నారు. స్పందించిన ధర్మాసనం ఈ విధానాన్ని 14 ఏళ్ల జైలు శిక్ష పూర్తైన ఖైదీలందరికీ వర్తింప జేస్తున్నారా అని అడిగింది.ఎంపిక చేసిన కొందరికి మాత్రమే ఎందుకు అమలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. శిక్షల తగ్గింపుపై ప్రతీ రాష్ట్రానికి ఓ విధానం ఉంటుందని, ఈ మేరకు అన్ని రాష్ట్రాలనూ అడగాలని ASG అన్నారు. గుజరాత్ సర్కార్ అర్హులైన ఖైదీలకు ఒకే విధానాన్ని అనురిస్తోందా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్న అని తేల్చి చెప్పింది.తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.