LOADING...
బిహార్ కులగణనపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. ప్రభుత్వ విధానపర నిర్ణయాలను అడ్డుకోలేమని తీర్పు
ప్రభుత్వ విధానపర నిర్ణయాలను అడ్డుకోలేమని తీర్పు

బిహార్ కులగణనపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. ప్రభుత్వ విధానపర నిర్ణయాలను అడ్డుకోలేమని తీర్పు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 06, 2023
03:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ కులగణనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను అడ్డుకోలేమని వెల్లడించింది. బిహార్‌ సర్కార్ ఇటీవలే చేపట్టిన కులగణనపై డేటా విడుదల చేసింది.అయితే తదుపరి సమాచారాన్ని వెల్లడించకుండా ప్రభుత్వాన్ని నిరోధించాలని కోరుతూ సుప్రీంలో దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయాన్ని అడ్డుకోలేమని ఖరాఖండిగా చెప్పేసింది. ఈ క్రమంలోనే కుల ఆధారిత సర్వే రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వాటి విచారణను 2024 జనవరికి వాయిదా వేస్తూ తీర్పు ప్రకటించింది. తొలుత ఈ అంశంపై పట్నా హైకోర్టు తీర్పు ఇచ్చింది.ఇందులో భాగంగా బిహార్‌ కుల ఆధారిత సర్వేను సమర్థిస్తూ ఆగస్ట్ 2న ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది.

DETAILS

సుప్రీం ఆదేశాలను పాటించలేదు, కనుక స్టే ఇవ్వండి : న్యాయవాది అపరాజితా సింగ్‌  

యూత్‌ ఫర్‌ ఈక్వాలిటీ, ఏక్‌ సోచ్‌ ఏక్‌ ప్రయాస్‌ అనే రెండు స్వచ్ఛంద సంస్థలు కులగణనపై రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ సుప్రీంను ఆశ్రయించాయి. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు విచారణ చేసింది. న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి, సర్వే ఫలితాలను ప్రకటించిందని పిటిషనర్‌ తరఫున వాదనలు జరిగాయి.గతంలో సుప్రీం ఇచ్చిన ఆదేశాలకు ప్రభుత్వ చర్య విరుద్ధమని, కనుక స్టే ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని అడ్డుకోలేమని, అది తప్పిదమే అవుతుందని ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ డేటాకు సంబంధించి సమస్యలు తలెత్తితే దాన్ని పరిశీలిస్తామని వివరించింది. ఈ నేపథ్యంలోనే పిటిషనర్ల దాఖలు చేసిన సవాలుపై బిహార్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పిటిషనర్ సవాల్ పై బిహార్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు