LOADING...
Indigo Crisis: ఇండిగో సంక్షోభ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు 
ఇండిగో సంక్షోభ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు

Indigo Crisis: ఇండిగో సంక్షోభ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 08, 2025
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండిగో సంక్షోభానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా నెలకొన్న ఇండిగో విమానాల రద్దుల వ్యవహారాన్ని అత్యవసరంగా విచారించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రాగా, సుప్రీం ధర్మాసనం స్పందించింది. ప్రస్తుతం ఈ అంశంపై తక్షణ విచారణ చేపట్టలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ సమస్యపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొంది. ఈ సమయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే ఇది తీవ్రమైన సమస్యేనని, లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.

వివరాలు 

పౌర విమానయాన శాఖతో పాటు డీజీసీఏ నుంచి స్టేటస్ రిపోర్టులు సమర్పించేలా ఆదేశాలు జారీ

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న నష్టాలపై జోక్యం చేసుకోవాలని కోరుతూ శనివారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై చీఫ్ జస్టిస్ స్వయంగా విచారణ చేపట్టాలని, పౌర విమానయాన శాఖతో పాటు డీజీసీఏ నుంచి స్టేటస్ రిపోర్టులు సమర్పించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు. అలాగే తక్షణ విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే తాజాగా అత్యవసర విచారణ నిర్వహించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Advertisement