Page Loader
K.Kavitha: ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు 
ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు

K.Kavitha: ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 22, 2024
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గత వారం అరెస్టయిన బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కవిత తరఫు న్యాయవాదులకు బెయిల్‌పై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. బెయిల్‌ పిటిషన్‌పై ట్రయల్ కోర్టు జాప్యం లేకుండా వెంటనే విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్, బేలా త్రివేదిలతో కూడిన ప్రత్యేక బెంచ్ ఆమె ఏకరీతి విధానాన్ని అనుసరించాలని,ట్రయల్ కోర్టు నుండి ఉపశమనం పొందాలని కోరుతూ ఆమె పిటిషన్‌ను స్వీకరించడానికి నిరాకరించింది. ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలపై ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్రయల్ కోర్టుకు వెళ్లాలని కవిత తరఫు న్యాయవాదులకు సూచించిన సుప్రీం