
Supreme Court: జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టులో తాజా పరిణామాలు వెలుగులోకి వచ్చాయి.
టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ప్రారంభమైంది.
సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను మరో బెంచ్‌కి బదిలీ చేయాలని నిర్ణయించింది.
జగన్ బెయిల్ రద్దు చేసి, విచారణను హైదరాబాద్ నుంచి మార్చాలని రఘురామకృష్ణరాజు చేసిన పిటిషన్లను సీజేఐ ధర్మాసనం విచారణ చేపట్టింది.
Details
డిసెంబర్ 22న విచారణ
ఈ సందర్భంగా, జగన్ తరఫు న్యాయవాది రంజిత్ కుమార్ ఈ పిటిషన్లు ఆంధ్రప్రదేశ్ కేసులు అని స్పష్టం చేశారు.
సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని కోరారు.
అయితే జస్టిస్ సంజయ్ కుమార్ "నాట్ బిఫోర్ మీ" అని చెప్పడంతో, ఈ పిటిషన్లను సీజేఐ మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని ఆదేశించారు.
తద్వారా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలో డిసెంబర్ 2న విచారణ జరిపేందుకు రిజిస్ట్రీ ఆదేశాలను జారీ చేసింది.