Page Loader
Supreme Court: క్రిమినల్ కేసులున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు సుప్రీం షాక్.. ఎన్నికల్లో పోటీపై కీలక ఆదేశాలు
Supreme Court: తీవ్ర నేరచరితులకు సుప్రీం షాక్.. ఎన్నికల్లో పోటీపై కీలక ఆదేశాలు

Supreme Court: క్రిమినల్ కేసులున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు సుప్రీం షాక్.. ఎన్నికల్లో పోటీపై కీలక ఆదేశాలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 09, 2023
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని క్రిమినల్ కేసులున్న ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈ మేరకు అలాంటి వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడంపై సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నేతలపై దాఖలైన కేసుల విచారణకు మార్గదర్శకాలను సూచించింది. ప్రజా ప్రతినిధులపై దాఖలైన క్రిమినల్ కేసులను వేగంగా విచారించాలని హైకోర్టులను ఆదేశించింది. తీవ్రమైన నేరాలల్లో ట్రయల్ కోర్టు విచారణను వాయిదా వేయకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే కేసుల సత్వర పరిష్కారానికి వెబ్‌సైట్‌‌‌ను రెఢీ చేయాలని ఆదేశించింది. తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిని జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ పిల్ దాఖలు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నేర కేసులున్న ఎంపీ, ఎమ్మెల్యేలపై విచారణ వేగం చేయాలి : సుప్రీం