Loading...
Supreme Court: ప్రైవేటు వర్సిటీలు లాభార్జన కేంద్రాలు కావొద్దు.. ఐదేళ్ల లెక్కలు ఇవ్వాలి: సుప్రీం
ఐదేళ్ల లెక్కలు ఇవ్వాలి: సుప్రీం

Supreme Court: ప్రైవేటు వర్సిటీలు లాభార్జన కేంద్రాలు కావొద్దు.. ఐదేళ్ల లెక్కలు ఇవ్వాలి: సుప్రీం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 22, 2026
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రైవేటు విశ్వవిద్యాలయాల ప్రధాన ఉద్దేశం డబ్బు సంపాదించడంగా ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలోని అన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలు గత ఐదేళ్ల ఆడిటెడ్‌ ఆర్థిక వివరాలను ఆరు వారాల్లోగా సమర్పించాలని ఆదేశించింది. నిధుల వినియోగం, విద్యార్థుల నుంచి వసూలు చేసిన రుసుములు, ఖర్చులు, మిగిలిన నిధులు, విద్యా కార్యకలాపాలతో ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తులకు చేసిన చెల్లింపుల వివరాలను కూడా అందులో పొందుపరచాలని పేర్కొంది. జస్టిస్‌ అహ్‌సానుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ ఎన్‌.వి.అంజరియాతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. విశ్వవిద్యాలయాల నుంచి వివరాలు అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటిపై అఫిడవిట్లు దాఖలు చేయాలని సూచించింది.

వివరాలు 

విచారణ నవంబరు 19కి వాయిదా

ప్రతి విద్యాసంస్థకు సామాజిక బాధ్యత ఉండాలని ధర్మాసనం పేర్కొంది.

సంస్థను సమర్థంగా నిర్వహించేందుకు ఆర్థిక వనరులను బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

అదే సమయంలో బోధనా, బోధనేతర సిబ్బంది అందించే సేవలకు తగిన వేతనాలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

నొయిడాలోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యార్థి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారిస్తున్న సమయంలో ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.

ఈ కేసులో తదుపరి విచారణను నవంబరు 19కి వాయిదా వేసింది.

ADVERTISEMENT