Page Loader
ఎన్నికలకు ముందు ఉచితాలు: మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు సుప్రీంకోర్టు నోటీసు
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు సుప్రీంకోర్టు నోటీసు

ఎన్నికలకు ముందు ఉచితాలు: మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు సుప్రీంకోర్టు నోటీసు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2023
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

పన్ను చెల్లింపుదారుల ఖర్చుతో రాజకీయ పార్టీలు నగదు, ఇతర ఉచిత వస్తువులను పంపిణీ చేయకుండా నిరోధించడానికి సమగ్ర మార్గదర్శకాలను కోరుతూ సామాజిక కార్యకర్త భట్టులాల్ జైన్ దాఖలు చేసిన దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యప్రదేశ్,రాజస్థాన్ ప్రభుత్వాలకు నోటీసు జారీ చేసింది. నాలుగు వారాల్లోగాఆ రెండు రాష్ట్రాలు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పన్ను చెల్లింపుదారుల సొమ్మును రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దుర్వినియోగం చేసిందని ఆరోపించిన పిటిషన్‌పై కేంద్రం, ఎన్నికల సంఘం (ఈసి), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు నోటీసులు జారీ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు సుప్రీంకోర్టు నోటీసు