Page Loader
AAP: ఆప్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. జూన్ 15లోగా పార్టీ ఆఫీస్‌ను ఖాళీ చేయాలని ఆదేశం
AAP: ఆప్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. జూన్ 15లోగా పార్టీ ఆఫీస్‌ను ఖాళీ చేయాలని ఆదేశం

AAP: ఆప్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. జూన్ 15లోగా పార్టీ ఆఫీస్‌ను ఖాళీ చేయాలని ఆదేశం

వ్రాసిన వారు Stalin
Mar 04, 2024
06:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

AAP: లోక్‌సభ ఎన్నికల వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. దిల్లీలోని ఆప్‌ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని కోర్టు ఆదేశించింది. జూన్ 15లోగా ఆమ్ ఆద్మీ పార్టీ తన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు కోసం కేటాయించిన స్థలంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల ఖాళీ చేయవలసి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సమయంలోనే దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అందుకే పార్టీకి అదనపు సమయం ఇస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ఆప్ కార్యాలయం విషయంపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హైకోర్టు స్థలంలో ఆప్ ఆఫీస్ నిర్మాణం