Surat Fire Accident: సూరత్ కెమికల్ ఫ్యాక్టరీలో కాలిపోయిన 7 మంది కార్మికుల మృతదేహాలు
గుజరాత్‌లోని సూరత్‌లోని ఏథర్ ఇండస్ట్రీస్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 27 మంది కార్మికుల మృతదేహాలను స్వాధీనం చేసుకోగా, మరో 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఏడుగురు కూలీలు అదృశ్యమయ్యారు. సైట్‌లో కూలింగ్,సెర్చ్ ఆపరేషన్‌లు జరుగుతుండగా, గురువారం వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. నివేదికల ప్రకారం, రసాయన నిల్వ ట్యాంక్‌లో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి. అయితే, కేసు దర్యాప్తు చేస్తే అగ్నిప్రమాదానికి అసలు కారణం వెల్లడవుతుందని, కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. కంపెనీ యజమాని అశ్విన్ దేశాయ్ గుజరాత్‌లోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలలో ఒకరు. ఆయన సంపద 1.3 మిలియన్ డాలర్లు.