LOADING...
Operation Sindoor: జమ్ముకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో మళ్లీ పాక్‌ డ్రోన్లు..?
జమ్ముకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో మళ్లీ పాక్‌ డ్రోన్లు..?

Operation Sindoor: జమ్ముకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో మళ్లీ పాక్‌ డ్రోన్లు..?

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2025
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ, పాకిస్థాన్ ఇప్పటికీ తన ప్రవర్తనను మార్చుకోలేదని రక్షణ విభాగ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో పాక్‌కు చెందిన డ్రోన్లు గాలిలో కనిపించినట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ ఘటనపై అలారమ్‌లు మోగలేదని సమాచారం. సాంబా ప్రాంతంలో పాక్ డ్రోన్లు చొచ్చుకువచ్చిన దృశ్యాలను ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది. ఈ సందర్భంగా గాల్లో భారీ శబ్దాలు వినిపించాయని, భారత్‌ కూడా ఎదురుదాడులు నిర్వహించి డ్రోన్లను తిప్పికొట్టినట్టు వెల్లడించారు.

వివరాలు 

జలంధర్‌ ప్రాంతంలో కూడా డ్రోన్ల కదలికలు

ఇక పంజాబ్‌లోని జలంధర్‌ ప్రాంతంలో కూడా డ్రోన్ల కదలికలు నమోదయ్యాయి. సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో డ్రోన్లు కనిపించాయని స్థానిక డిప్యూటీ కమిషనర్‌ స్పష్టం చేశారు. భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తునాతునకలు చేసిందని తెలిపారు. ప్రస్తుతం నిపుణులు డ్రోన్ల శకలాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జమ్ముకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో మళ్లీ పాక్‌ డ్రోన్లు..?