
Asif Sheikh: పహల్గాం దాడి.. లష్కరే ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇల్లు పేల్చివేత
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్న ఆసిఫ్ ఫౌజీ అనే ఉగ్రవాది తన ఇంటికి భద్రతా బలగాలు రావచ్చని ముందుగానే ఊహించి..వారికి ట్రాప్ పెట్టాడు.
అయితే,భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ఆ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
అంతేకాదు,మరో ఉగ్రవాది ఇంటిలోనూ ఇలాంటి ఘటనే పునరావృతమైంది, ఇది కూడా గమనించదగిన అంశమే.
దక్షిణ కశ్మీర్‌లోని త్రాల్‌కు చెందిన ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్,ఆదిల్ థోకర్ అలియాస్ ఆదిల్ గురి అనే ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లలో శోధనలు నిర్వహించేందుకు జమ్ముకశ్మీర్ పోలీసులు వెళ్లారు.
ఈతనిఖీల సమయంలో,ఆ ఉగ్రవాదుల నివాసాల్లో ముందుగానే అమర్చిన పేలుడు పదార్థాలు యాక్టీవేట్ అయినట్లు గుర్తించారు.
పరిస్థితిని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే బయటకు వెళ్లగలిగారు.తక్కువ సమయంలోనే భారీ పేలుళ్లు సంభవించాయి.
వివరాలు
మూసా, యూనిస్, ఆసిఫ్ అనే కోడ్ నేమ్స్
ఈ చర్యలు ఉగ్రవాదులు ముందుగానే వేసిన కుట్ర భాగంగా జరిగి ఉండొచ్చని,వారు తమ నివాసాల సమాచారం భద్రతా బలగాలకు తెలిసేలా ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసి ఉండవచ్చని ఒక పోలీసు అధికారి మీడియాతో అన్నారు.
అధికారుల ప్రకారం,ఆదిల్ 2018లో చట్టబద్ధంగా పాకిస్థాన్ వెళ్లి, అక్కడ ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ తీసుకున్నాడు.
అనంతరం గత ఏడాది తిరిగి జమ్మూ కశ్మీర్‌కి వచ్చాడు.పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి.
వారిలో ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తాలా ఉన్నారు. పీటీఐ అందించిన సమాచారం ప్రకారం, వీరికి మూసా, యూనిస్, ఆసిఫ్ అనే కోడ్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఆదిల్ థోకర్‌కి వీరితో సంబంధం ఉందని కూడా గుర్తించారు.
వివరాలు
ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం
ఈ నలుగురు 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' అనే ఉగ్రవాద సంస్థ సభ్యులుగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ దాడిలో తప్పించుకున్న ప్రత్యక్ష సాక్షుల వర్ణనల ఆధారంగా ఈ ఊహాచిత్రాలను రూపొందించారు.
ఉగ్రవాదులు దాడి సమయంలో పురుషులను వేరు చేసి, వారి గుర్తింపులను పరీక్షించిన సమయంలోనే బాధితులు వారి ముఖాలను చూసే అవకాశం లభించింది.
విడుదలైన ఫోటోల ఆధారంగా భద్రతా దళాలు ఈ ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఉగ్రవాది ఇల్లు ధ్వంసం
Home of Pahalgam terrorist Asif Sheikh demolished in Tral, reports @nazir_masoodi. There were at least 4 others, including Aadil Thakur of Bijbehara and two Pakistani national terrorists. pic.twitter.com/UOABb0Jic1
— Shiv Aroor (@ShivAroor) April 25, 2025