Jammu: సుంజ్వాన్ ఆర్మీ బేస్ సమీపంలో ఉగ్రదాడి.. జవాన్కు గాయాలు
జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో, జమ్మూలోని పెద్ద ఆర్మీ స్థావరంపై ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు ఆర్మీ బేస్ వద్ద కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే స్పందించి, సుంజ్వాన్ ఆర్మీ బేస్ ను కట్టడి చేసి యాంటీ-టెర్రర్ ఆపరేషన్‌ను మొదలుపెట్టారు. ప్రస్తుతం సైనిక స్థావరం వద్ద హైఅలర్ట్ ప్రకటించారు. ప్రత్యేక దళాలు కూడా ఈ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో సహకరిస్తున్నాయి. రక్షణరంగ వర్గాలు తెలిపినట్లుగా, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో సెంట్రీ డ్యూటీలో ఉన్న ఒక జవాను గాయపడ్డాడు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా సిబ్బంది ఉత్కంఠతో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు.