T- SAFE App: సురక్షిత ప్రయాణానికి 'టీ-సేఫ్'.. 35 వేలకుపైగా ప్రయాణాలకు భద్రతా వలయం!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ పోలీసులు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రారంభించిన 'టీ-సేఫ్' యాప్ ఒక సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది.
ఈ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న ప్రయాణికులు, ప్రయాణ సమయంలో యాక్టివేట్ చేస్తే, గమ్యస్థానం చేరే వరకు రియల్‌టైం పర్యవేక్షణ అందిస్తుంది.
ప్రయాణ మార్గం మారినా లేదా వాహనం ఎక్కువ సమయం ఆగినా, వెంటనే డయల్ 100కు అత్యవసర సందేశాన్ని పంపిస్తుంది. దీంతో సమీపంలోని పోలీస్ గస్తీ సిబ్బంది ఘటనాస్థలికి తక్షణమే చేరుకునేలా చేస్తుంది.
స్మార్ట్‌ఫోన్లతో పాటు ఇంటర్నెట్ సదుపాయం లేని ఫీచర్ ఫోన్లలో కూడా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. 2024 మార్చి 12న సీఎం రేవంత్‌రెడ్డి దీన్ని ప్రారంభించగా, ఇప్పుడు ఈ యాప్ ఒక సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది.
Details
ఏడాదిలో 'టీ-సేఫ్' సాధించిన ఘనతలివే
43 వేలకుపైగా ఆండ్రాయిడ్ ఫోన్లలో 'టీ-సేఫ్' యాప్ డౌన్‌లోడ్ అయింది.
35 వేలకుపైగా ప్రయాణాలను ఈ యాప్ పర్యవేక్షించింది.
36,470 రైడ్ డీవియేషన్లు గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టింది.
23 వేలకుపైగా అత్యవసర (SOS) సందేశాలు డయల్ 100కు పంపించింది.
పోలీసులు సగటున 8 నిమిషాల్లోపు ప్రయాణికుల వద్దకు చేరుకున్నారు.
గూగుల్ ప్లే స్టోర్‌లో 269 రివ్యూలతో 4.8 రేటింగ్ అందుకుంది.
ఈ విధంగా 'టీ-సేఫ్' యాప్ప్ర యాణికులకు భద్రతను అందిస్తూ తెలంగాణ పోలీసుల విజయవంతమైన భద్రతా యాజమాన్య విధానంగా నిలుస్తోంది.