Page Loader
Taj Mahal: టిక్కెట్ల విక్రయాల ద్వారా అత్యధిక ఆదాయం.. టాప్‌లో తాజ్ మహల్ 
టిక్కెట్ల విక్రయాల ద్వారా అత్యధిక ఆదాయం.. టాప్‌లో తాజ్ మహల్

Taj Mahal: టిక్కెట్ల విక్రయాల ద్వారా అత్యధిక ఆదాయం.. టాప్‌లో తాజ్ మహల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 04, 2025
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

మొఘల్ కాలంలో నిర్మించబడిన తాజ్‌ మహల్ కు విశేషమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. ఈ శిలా కట్టడాన్ని వీక్షించేందుకు రోజువారీగా వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉన్న ఈ అద్భుత నిర్మాణాన్ని విదేశీ పర్యాటకులు సైతం పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ అందమైన కట్టడం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. గత ఐదు సంవత్సరాలలో ఈ అద్భుత కట్టడాన్ని దర్శించడానికి వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది.

వివరాలు 

అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న కట్టడం 

పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ప్రాచీన కట్టడాల్లో అత్యధికంగా టికెట్ విక్రయాలు జరగుతున్న నిర్మాణంగా తాజ్‌మహల్ మొదటి స్థానంలో ఉంది. పర్యాటకుల కోసం టికెట్లు విక్రయించి ఆదాయాన్ని సంపాదిస్తున్న ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) పరిధిలోని కట్టడాల్లో తాజ్‌మహల్ ప్రధాన స్థానాన్ని దక్కించుకున్నట్లు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని తెలిపారు. గత ఐదు సంవత్సరాలలో పురావస్తు శాఖ పరిధిలోని ప్రదేశాల నుండి టికెట్ విక్రయాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం ఎంత? అనే ప్రశ్నను రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగారు. దీనికి స్పందిస్తూ మంత్రి సంబంధిత పురావస్తు కట్టడాల ఆదాయ సమాచారంను సభ ముందు ఉంచారు.

వివరాలు 

 అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న ASI నిర్మాణాలు 

2019 నుండి 2024 మధ్యకాలంలో పురావస్తు కట్టడాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయాన్ని సమర్పించిన ఆ వివరాల్లో తాజ్‌మహల్ అగ్రస్థానంలో ఉంది. టికెట్ అమ్మకాల ద్వారా అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న ASI నిర్మాణాల్లో.. ఆగ్రా ఫోర్ట్ (ఆగ్రా) కుతుబ్ మినార్ (ఢిల్లీ) మామల్లపురం (తమిళనాడు) సన్ టెంపుల్ (కోణార్క్) ప్రధానంగా ఉన్నాయి. తాజ్‌మహల్ చరిత్ర 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్, తన ప్రియమైన భార్య ముమ్తాజ్ మహల్ స్మృతిలో యమునా నది తీరాన తాజ్‌మహల్‌ను నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ఈ నిర్మాణకౌశలం, అపూర్వ శిల్పకళ కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తూ ముందంజలో కొనసాగుతోంది.