LOADING...
Bomb Threat: టీవీకే పార్టీ నాయకుడు విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు 
టీవీకే పార్టీ నాయకుడు విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు

Bomb Threat: టీవీకే పార్టీ నాయకుడు విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2025
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

చెన్నై నగరంలోని నీలాంగరై ప్రాంతంలో ఉంటున్న తమిళనాడు వెట్రికళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపును గుర్తు తెలియని వ్యక్తి పోలీసులు నిర్వహించే కంట్రోల్ రూమ్‌కి గురువారం ఉదయం ఫోన్ చేసి, "విజయ్ నివాసంలో బాంబులు పేలబోతున్నాయి" అని చెప్పినట్లు సమాచారం. ఈ సంఘటనపై స్పందించిన, చెన్నై పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్‌ను సంఘటన స్థలానికి పంపారు. స్క్వాడ్ నిపుణులు విజయ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. బాంబు బెదిరింపు బూటకమని సోదాల్లో తేలింది. బాంబు బెదిరింపు చేసిన వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియరాలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టీవీకే పార్టీ నాయకుడు విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు