
CM MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ కు తీవ్ర అస్వస్థత.. కొనసాగుతున్న చికిత్స..!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ ఈరోజు (జూలై 21) ఉదయం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనకు కాళ్ళు తిరిగినట్టుగా అనిపించడం ప్రారంభమైంది. వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఆయనను చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్‌లోని వైద్య బృందం స్టాలిన్ ఆరోగ్య పరిస్థితిని సన్నిహితంగా పరిశీలిస్తోంది. స్టాలిన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని హాస్పిటల్ వర్గాలు అధికారికంగా హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి.
వివరాలు
సీఎం స్టాలిన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది: వైద్యుల బృందం
అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ బీజీ మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం మార్నింగ్ వాక్ సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అకస్మాత్తుగా అస్వస్థత తలెత్తిందని తెలిపారు. కళ్లు తిరగడంతో కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. అవసరమైన అన్ని వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని, వైద్యుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని వివరించారు. దీనిపై అధికారిక హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇక అపోలో హాస్పిటల్ వద్ద భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేసినట్లు సమాచారం.