
MP Ganeshamurthi: తమిళనాడు ఎంపీ గణేశమూర్తి గుండెపోటుతో మృతి
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు ఈరోడ్‌లోని సిట్టింగ్ లోక్‌సభ ఎంపీ, MDMKకి చెందిన గణేశమూర్తి గుండెపోటుతో గురువారం ఉదయం మరణించినట్లు ANI నివేదించింది.
మార్చి 24న ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చేరారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈరోడ్ నుంచి డీఎంకే టికెట్‌పై ఎన్నికైన గణేశమూర్తి తీవ్ర మనస్తాపానికి గురై మార్చి 24న నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.
ప్రాథమిక చికిత్స అనంతరం,ఆయనను ఐసియులో,వెంటిలేటర్‌పై ఉంచినట్లు పిటిఐ తెలిపింది.
అనంతరం ఎంపీని సమీపంలోని కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
గణేశమూర్తి ఆరోగ్యంపై ఆరా తీసేందుకు రాష్ట్ర పట్టణాభివృద్ధి,గృహనిర్మాణ శాఖ మంత్రి ఎస్ ముత్తుసామి,మోదకురిచ్చి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ సీ సరస్వతి,అన్నాడీఎంకే నేత కేవీ రామలింగం సహా పలువురు రాజకీయ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు.
Details
తిరుచ్చి నుండి MDMK పార్టీ అభ్యర్థిగా దురై వైకో
మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన గణేశమూర్తి ఎండీఎంకే శ్రేణుల్లో ప్రముఖ పదవులు చేపట్టారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈరోడ్ స్థానం నుంచి పోటీ చేసేందుకు పార్టీ టికెట్ నిరాకరించడంపై ఆయన కలత చెందినట్లు సమాచారం.
డీఎంకే ఈరోడ్‌లో తన అభ్యర్థిని నిలబెట్టింది . తిరుచ్చి స్థానాన్ని MDMKకి ఇవ్వాలని నిర్ణయించింది. MDMK ప్రధాన కార్యదర్శి వైకో కుమారుడు దురై వైకో తిరుచ్చి నుండి పార్టీ అభ్యర్థిగా ఎంపికయ్యారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గుండెపోటుతో తమిళనాడు ఎంపీ మృతి
#UPDATE | MDMK MP from Erode, Ganesamoorthy passed away at 5:05 am today due to cardiac arrest. He was hospitalised on March 24 after allegedly attempting suicide. #TamilNadu https://t.co/tGQAZoRuD2
— ANI (@ANI) March 28, 2024