తదుపరి వార్తా కథనం
TDP: హిందూపురం మున్సిపాలిటీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 03, 2025
11:50 am
ఈ వార్తాకథనం ఏంటి
హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీ విజయం సాధించింది. 40 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో 23 మంది మద్దతుతో ఆరో వార్డు కౌన్సిలర్ రమేశ్ మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
ఓటింగ్‌లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు.
వైసీపీ అభ్యర్థి లక్ష్మి 14 ఓట్లతో ఓడిపోయారు. ముగ్గురు సభ్యులు గైర్హాజరయ్యారు. ఏలూరులో, రెండు డిప్యూటీ మేయర్ స్థానాలు కూడా టీడీపీ ఖాతాలో చేరాయి.
ఉమామహేశ్వరరావు మొదటి డిప్యూటీ మేయర్‌గా, దుర్గాభవాని రెండో డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీడీపీ మద్దతు అభ్యర్థి తహసీన్ 29 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమెకు 41 ఓట్లు, వైసీపీ అభ్యర్థి కరీముల్లాకు 12 ఓట్లు లభించాయి.