తదుపరి వార్తా కథనం

teenmar mallanna: తెలంగాణలో నూతన పార్టీ ఫ్లాగ్‌ను ఎగరేసిన తీన్మార్ మల్లన్న
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 17, 2025
04:24 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. తన పార్టీకి 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ' అనే పేరును పెట్టినట్లు అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పార్టీ పేరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీని బీసీల తలరాత మారే రోజుగా భావిస్తున్నానని తెలిపారు.
Details
బీసీల హక్కుల కాపాడేందుకు కృషి
తెలంగాణలో మెజార్టీ సంఖ్యలో ఉన్న బీసీలకు ఇప్పటివరకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే కొత్త పార్టీని ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చిందని స్పష్టం చేశారు. బీసీలకు శక్తివంతమైన వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పనిచేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. మొత్తంగా, బీసీల రాజకీయ హక్కులను కాపాడేందుకు, వారికో ప్రత్యేక వేదికగా మల్లన్న కొత్త పార్టీ ఆవిష్కృతమైంది.