Page Loader
Teetar Singh : 50ఏళ్లలో 20సార్లు ఓడిపోయారు..అయినా సరే మళ్లీ పోటీకి రెడి 
Teetar Singh : 50ఏళ్లలో 20సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన తీతర్ సింగ్

Teetar Singh : 50ఏళ్లలో 20సార్లు ఓడిపోయారు..అయినా సరే మళ్లీ పోటీకి రెడి 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 07, 2023
03:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్ ఎన్నికల బరిలో మరోసారి తీతర్ సింగ్ నిలవనున్నారు. 78 ఏళ్ల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGS కార్యకర్త తీతర్ సింగ్ నవంబర్ 25న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి, తీతర్ సింగ్ ఇప్పటివరకు 20 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఇన్ని ఏళ్ల నుంచీ ప్రజలు తనని గెలపించకపోయినా మరోసారి పోటీ చేస్తున్నారు. దీనిపై ఆయన స్పందన కోరగా, తాను ఎందుకు ఎన్నికల బరిలో నిలవకూడదు అని బదులిచ్చారు. అయితే సింగ్ 1970ల నుంచి రాజస్థాన్‌లో జరిగిన ప్రతి ఎన్నికల్లో పోటీ చేశాడు.బరిలో నిలిచిన ప్రతీసారి డిపాజిట్‌ సైతం గల్లంతయ్యేదన్నారు.

details

అందరికీ నిరుపేదలకు భూమి, సౌకర్యాలివ్వాలి : తీతర్ సింగ్ 

ప్రభుత్వం నిరుపేదలకు భూమి, సరిపడ సౌకర్యాలు ఇవ్వాలన్నదే తన నినాదం అని, ఈ మేరకు ఎన్నికలు అనేవి హక్కుల కోసం పోరాటాలు అని స్పష్టం చేశారు. . ప్రజాదరణ కోసం లేదా రికార్డుల కోసం తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని, హక్కులను సాధించుకునేందుకు ఇదో ఆయుధమని స్వత్రంత్ర అభ్యర్థి తీతర్ సింగ్ అన్నారు. తాను పంచాయతీ నుంచి లోక్‌సభ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లో పోటీ చేశానని, అయితే ప్రతిసారీ ఓటమిని ఎదుర్కొన్నానన్నారు. ఈసారి అదే ఉత్సాహంతో ఎన్నికల బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నట్లు చెప్పారు. ఈ నెలాఖరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తానన్నారు. భూమిలేని నిరుపేద కూలీలకు, ప్రభుత్వం భూమిని కేటాయించాలనేది తన డిమాండ్ అని చెప్పుకొచ్చారు.

details

సాధారణ రోజుల్లో రైతు కూలీలుగా పనిచేస్తా : తీతర్ సింగ్

పేదలకు భూమిని కేటాయించాలనే తన డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత సమాజికవర్గానికి చెందిన తీతర్ సింగ్, తన కుమారులు రోజు వారీ కూలీలుగానే పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తనకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారని, మనవళ్లకు కూడా పెళ్లిళ్లు అయ్యాయన్నారు. తన వద్ద డిపాజిట్ నగదు రూ. 2,500 ఉందని, అయితే మరే భూమి, ఆస్తి, వాహనాలు లేవన్నారు. సాధారణ రోజుల్లో MGNREGA కింద కూలీగా పని చేస్తానని కానీ ఎన్నికల సమయంలో తన కోసం ప్రచారం చేయడంపై దృష్టి సారిస్తానన్నారు. 2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 938 ఓట్లు, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 427, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 653 ఓట్లను సింగ్ సాధించారు.