
Tejashwi Yadav: తండ్రైన తేజస్వి యాదవ్.. మగ బిడ్డకు జన్మనిచ్చిన రాచెల్ గోడిన్హో
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మళ్లీ తండ్రయ్యారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తన భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చిందని వెల్లడిస్తూ, శిశువు ఫోటోను కూడా షేర్ చేశారు. కొత్తగా వచ్చిన చిన్నారి గురించి తెలియజేస్తూ ఎంతో ఆనందంగా ఉందని ట్వీట్ ద్వారా తెలిపారు. తేజస్వి యాదవ్ దంపతుల తొలి సంతానం 2023లో నవరాత్రుల సమయంలో జన్మించింది. ఆ చిన్నారికి కాత్యాయనీ అనే పేరు పెట్టారు. తేజస్వి యాదవ్ 2021లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయన తన చిన్ననాటి స్నేహితురాలైన రాచెల్ గోడిన్హోను పెళ్లి చేసుకున్నారు.
వివరాలు
తేజస్వి యాదవ్ రాజకీయంగా బిజీ
అదే ఏడాది డిసెంబర్ నెలలో హిందూ సంప్రదాయాల ప్రకారం ఈ వివాహ వేడుక జరిగింది. తేజస్వి, రాచెల్ గోడిన్హో ఇద్దరూ న్యూఢిల్లీకి చెందిన ఆర్కేపురంలోని డీపీఎస్ (Delhi Public School)లో కలిసి చదువుకున్నారు. విద్యార్థి దశలో మొదలైన వారి స్నేహం అనంతరం వివాహ బంధంగా మారింది. ప్రస్తుతం తేజస్వి యాదవ్ రాజకీయంగా బిజీగా ఉన్నారు. బీహార్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీకి నాయకత్వం వహిస్తూ, ప్రణాళికాబద్ధంగా సమరానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఏకంగా అధికారం సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఎన్నికల వేళ మరోసారి తండ్రయ్యారని ప్రకటిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మరోసారి తండ్రైన తేజస్వి యాదవ్
Former Bihar Deputy CM and RJD leader Tejashwi Yadav announces the birth of his second child
— ANI (@ANI) May 27, 2025
"The wait is finally over. So grateful, blessed and pleased to announce the arrival of our little boy" he tweets pic.twitter.com/xhSBpO88gv