
తెలంగాణ అలర్ట్: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా అన్ని జిల్లాల్లో కలిపి గురువారం ఒక్కరోజే 31 ఇప్పుడు పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
నెల క్రితం వరకు 9 లేదా 10 జిల్లాల్లో మాత్రమే కరోనా కొత్త కేసులు నమోదయ్యవి. గత వారం రోజులుగా జయశంకర్ భూపాలపల్లి, కుమురం భీమ్ ఆసిఫాబాద్ మినహా అన్ని జిలాల్లో వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తెలంగాణలో ప్రస్తుతం 200 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త కేసులు మంగళవారం అత్యధికంగా 40నమోద్యయాయి. గత రెండు వారాల్లో కొత్త కేసులు 12శాతం నుంచి 20శాతానికి పెరిగాయి.
కోవిడ్
వేసవిలోనూ కరోనా కేసుల పెరుగుదల
రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరగనప్పటికీ, కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు ఆస్పత్రుల్లో చేరనప్పటికీ, అన్ని జిల్లాలకు వైరస్ వ్యాపించటం ఆందోళన కలిగిస్తోందని ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
వేసవి ఎక్కువగా ఉన్నప్పటికీ కేసులు పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రాబోయే నాలుగు నుంచి ఆరు వారాల వరకు కేసులు పెరుగుతాయని ఆరోగ్య అధికారులు భావిస్తున్నారు.
కరోనా బాధితులు కచ్చితంగా పెరుగుతున్నారని, జలుబు, దగ్గు మరియు శ్వాసకోశ బాధ వంటి లక్షణాలతో చాలా మంది వస్తున్నారని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు చెప్పారు. ఒమిక్రాన్, దాని వేరియంట్ XBB.1.16 త్వరగా వ్యాపిస్తాయని, వీటి వల్లే కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని రాజారావు వివరించారు.