Page Loader
Telangana: బడ్జెట్ చర్చలో రేవంత్ రెడ్డి సర్కార్ రికార్డు 
బడ్జెట్ చర్చలో రేవంత్ రెడ్డి సర్కార్ రికార్డు Add Image

Telangana: బడ్జెట్ చర్చలో రేవంత్ రెడ్డి సర్కార్ రికార్డు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2024
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సోమవారం 16 గంటలకు పైగా మారథాన్ సెషన్‌తో రికార్డు సృష్టించింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన చర్చ మంగళవారం తెల్లవారుజామున 2.15 గంటల వరకు కొనసాగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్ర అసెంబ్లీకి సుదీర్ఘ సమయం కొనసాగింది. మునుపటి BRS పాలనలో సభ 12 గంటల పాటు కొనసాగింది. ఇప్పుడు ఆ రికార్డును రేవంత్‌ సర్కార్‌ బ్రేక్‌ చేసింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు రోజంతా తమ తమ పార్టీల తరపున అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2024-25కి సంబంధించిన డిమాండ్‌లపై ఓటింగ్‌ ప్రారంభమైన తొలిరోజున ముఖ్యమంత్రి, మరో ఐదుగురు మంత్రులు ప్రతిపాదించిన 19 డిమాండ్‌లపై అసెంబ్లీ చర్చించి ఆమోదించింది.

వివరాలు 

బీఆర్‌ఎస్‌ సర్కార్.. రాష్ట్రంపై అప్పుల భారంమోపింది: డిప్యూటీ సీఎం

విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ నుండి రావాల్సిన ఆస్తులు, అప్పుల విభజన నుండి అనేక సమస్యలపై అధికార, ప్రతిపక్షలు మధ్య చర్చ కొనసాగింది. ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అర్ధరాత్రి 12.30 గంటలకు ఎమ్మెల్యేలు లేవనెత్తిన సమస్యలపై సమాధానం ప్రారంభించి 2.15 గంటలకు ముగించారు. గత పదేళ్ల పాలనలో అదనపు విద్యుత్‌ ఉత్పత్తిని చేపట్టని బీఆర్‌ఎస్‌ సర్కార్.. రాష్ట్రంపై అప్పుల భారం మోపిందని డిప్యూటీ సీఎం ధ్వజమెత్తారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ మళ్లీ సమావేశమై వాయిదా పడింది. ఈ సమావేశంలో మరో 19 డిమాండ్లతో ముఖ్యమంత్రితో పాటు మరో ఏడుగురు మంత్రులు చర్చ కోసం సభలో ప్రవేశపెట్టనున్నారు.