
విద్యాశాఖకు రూ. 19,093, నీటి పారుదల రంగానికి రూ. 26,885కోట్లు, హోంశాఖకు రూ 9,599కోట్లు, పురపాలక శాకకు రూ. 11, 327 కోట్లు కేటాంయినట్లు మంత్రి హరిశ్ రావు ప్రకటించారు.
ఆర్థిక శాఖకు రూ. 49,749 కోట్లు కేటాయించినట్లు మంత్రి హరీశ్ ప్రకటించారు.
125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం మార్చి నాటికి పూర్తి చేయనున్నట్లు మంత్రి హరీశ్ ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం 29జిల్లాల్లో రూ. రూ.1581కోట్లతో కలెక్టరేట్ల నిర్మాణాలను చేపట్టినట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఇప్పటికే 17భవనాలను ప్రారంబించినట్లు మరో 11 భవనాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
2023 ఆర్థిక సంవత్సరానికి గాను ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్ కోసం రూ.1,463కోట్లను కేటాయించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కోసం రూ. 200కోట్లు, ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ మార్కెట్లకోసం రూ. 400కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ కోసం రూ.1,101కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
పల్లె ప్రగతి, పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426కోట్ల నిధులు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
యూనివర్సిటీల అభివృద్ధికి కోసం రూ. 500 కోట్ల కేటాయించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఫారెస్ట కాలేజీ కోసం రూ. 100 కోట్ల నిధులు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఓల్డ్ సిటీ మెట్రో కనెక్టివిటీ కోసం రూ. 500కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ. 12వేలకోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
బీసీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఈ బడ్జెట్ లో బీసీ సంక్షేమం కోసం రూ.6,229కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధుకు రూ.17,700కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ల కోసం రూ. 12,000 కోట్లు కేటాయించినట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఈ బడ్టెట్‌లో విద్యుత్ రంగానికి రూ. 12,727 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు.
వ్యవసాయరంగానికి రూ.26,831కోట్లు కేటాయించినట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. రైతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు భీమా లాంటి పథకాలు రైతుల కన్నీళ్లు తూడుస్తున్నాయన్నారు.
2023 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లుగా మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. మూలధన వ్యయం రూ.2,11,685కోట్లు, మూలధన వ్యయం రూ.37,525 కోట్లుగా హరీశ్ రావు వెల్లడించారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో బడ్జెట్ సమర్పిస్తున్నారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో బడ్జెట్ సమర్పిస్తున్నారు.
సీఎం కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలో మంత్రలు ఆర్థిక మంత్రి హరిష్ రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వి.ప్రశాంత్‌రెడ్డి బడ్టెట్ ప్రతులను సీఎం కేసీఆర్‌తో పాటు స్వీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మండలి ఛైర్మన్‌కు అందజేశారు.
అసెంబ్లీలో హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా, మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వి.ప్రశాంత్‌రెడ్డి సమర్పించనున్నారు.