Page Loader
Telangana Budget: నేడు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి 
Telangana Budget: నేడు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి

Telangana Budget: నేడు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి 

వ్రాసిన వారు Stalin
Feb 10, 2024
08:33 am

ఈ వార్తాకథనం ఏంటి

రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం శనివారం ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. రూ.2.72 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశమై.. బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదిస్తుంది. అసెంబ్లీలో ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌ బాబు బడ్జెట్‌ను చదివి వినించనున్నారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వ ఈ బడ్జెట్‌లో కేటాయింపులు జరిపే అవకాశం ఉంది. అయితే శనివారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కేవలం 3నెలల కాలానికి సంబంధించినది. లోక్‌సభ ఎన్నికలు అయ్యాక పూర్తిస్థాయి బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉదయం 9గంటలకు కేబినెట్ సమావేశం