Telangana Budget: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రుణమాఫీపై కీలక ప్రకటన
Telangana Budget 2024: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సందర్భంగా రైతులకు భట్టి గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలోని రైతులకు రూ.2లక్షల రుణమాపీపై కీలక ప్రకటన చేశారు. రుణమాఫీ కార్యాచరణ, విధివిధానాలను త్వరలోనే ఖరారు చేయబోతున్నట్లు తెలిపారు. రైతుబంధు నిబంధనలను పున:సమీక్షస్తామని భట్టి పేర్కొన్నారు. అర్హులకే రైతుబంధు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. రైతుబంధును ఎకరాకు రూ. 15వేలు ఇస్తామని వివరించారు. కౌలు రైతులకు సైతం రైతుబంధును ఇవ్వనున్నట్లు భట్టీ చెప్పారు. గత ప్రభుత్వంలో రైతుబంధు కారణంగా పెట్టుబడిదారులు లాభపడ్డారన్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనుగోలు చేసిన భూములకు సైతం రైతుబంధు ఇచ్చినట్లు, ఇప్పుడు అలాంటి వారికి ఇచ్చే అవకాశం లేదన్నారు.