LOADING...
Telangana Cabinet Meeting: జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

Telangana Cabinet Meeting: జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2025
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిని విస్తరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ప్రకారం 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కీలక కేబినెట్ సమావేశం సుమారు నాలుగు గంటలకుపైగా వివిధ అంశాలపై చర్చించింది. జీహెచ్‌ఎంసీలో విలీనం చేయనున్న మున్సిపాలిటీలు: పెద్ద అంబర్‌పేట్‌, జల్‌పల్లి, శంషాబాద్‌, తుర్కయంజాల్‌, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, మేడ్చల్‌, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్‌కేసర్‌, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్‌, బొల్లారం, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బడంగ్‌పేట్‌, బండ్లగూడ జాగీర్‌, మీర్‌పేట, బోడుప్పల్‌, నిజాంపేట్‌, ఫిర్జాదిగూడ, జవహర్‌నగర్‌.

వివరాలు 

3,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు..

అదే విధంగా, కొత్త డిస్కమ్ ఏర్పాటు కోసం కూడా కేబినెట్ అనుమతి ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఈ కొత్త డిస్కమ్ పరిధిలో లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లు, నగర మెట్రో వాటర్ సప్లై, వ్యవసాయ రంగ కనెక్షన్లు, అలాగే మిషన్ భగీరథకు చెందిన విద్యుత్ కనెక్షన్లు ఉండనున్నాయని చెప్పారు. వచ్చే పదేళ్లలో రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైన ప్రణాళికలపై సమావేశంలో మంత్రివర్గం చర్చించినట్టు వివరించారు. ఈ నేపథ్యంలో 3,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు చేయాలని, త్వరలోనే ఇందుకు సంబంధించిన టెండర్లు పిలవాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

వివరాలు 

కేబినెట్ ఆమోదించిన మరిన్ని నిర్ణయాలు

2,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ కొనుగోలు పంప్డ్ స్టోరేజ్ పవర్ సెక్టార్‌లో పెట్టుబడులకు ఆహ్వానం కొత్త పరిశ్రమలు తమకే తాముగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు అనుమతి ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 800మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణం పాల్వంచ,మక్తల్ ప్రాంతాల్లో అదనపు విద్యుత్ ప్లాంట్ల అవకాశాల పరిశీలన హైదరాబాద్‌ను మూడు వలయాలుగా విభజించి భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు భూగర్భ విద్యుత్ లైన్లతో పాటు టీ-ఫైబర్ కేబుళ్లను కూడా ఏర్పాటు చేయనున్నారు భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలంలోని పెద్దనల్లవెల్లిలో యంగ్ ఇండియా స్కూల్‌కు 20 ఎకరాల భూకేటాయింపు ములుగు జిల్లా జగ్గన్నపేటలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు 40ఎకరాలు కేటాయింపు జూబ్లీహిల్స్‌తో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల స్థాపన

ట్విట్టర్ పోస్ట్ చేయండి

27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు నిర్ణయించిన కేబినెట్